Back to FeedQuickToday Shorts
Andhra Pradesh
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
కుప్పంలో కృష్ణమ్మ సందడి.. అన్నదాతల ఆనందహేల
ఆంధ్రప్రదేశ్లోని హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు రాయలసీమలో పారుతున్నాయి.
రాష్ట్రంలోని సుదూర ప్రాంతమైన కుప్పానికి రెండోసారి కృష్ణా నీళ్లు చేరడంతో రైతన్నల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.నీళ్లు రాకతో భావోద్వేగానికి గురైన రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఒక రైతు అయితే ఉత్సాహం పట్టలేక ఏకంగా కాలువలోకి దూకి ఈత కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
మరికొందరు కృష్ణమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కరవు పరిస్థితుల్లో కృష్ణా జలాలు రావడం తమకు ప్రాణదానం లాంటిదని, ఈ నీరు తమ వ్యవసాయానికి ఎంతో విలువైందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


